నామ సంకీర్తనమే ప్రస్తుత జగత్తులో దైవ సాక్షాత్కారానికి సులువైనమార్గం.
దీనిని రుజువు చేస్తూ అనేకానేక ఋషులు, మునులు తరతరాలుగా లోకంలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు భక్త తుకారం, సంత్ జ్ఞానేశ్వర్. వీరే కాకుండా మహారాష్ట్రలో ఇంకా ఎంతో పుణ్యపురుషులు, సంతులు దైవ మహిమను తమ గానల ద్వారా, కీర్తనల ద్వారా జనులకు సామజిక మరియు ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేసారు.
భక్త తుకారం తన జీవిత కాలంలో ఎన్నో అభంగాలను (భగవంతున్ని భక్తితో గానం చేసే సంకీర్తనలు) రచించారు. అలాగే అయన సమాజ మాలిన్య నిర్మూలనకు దోహదం చేసే కీర్తనలు (మహారాష్ట్రలో వార్కరి సాంప్రదాయ జనం చేసే ఒకరకమైన భక్తి సామజిక కార్యక్రమం) కూడా చేసేవారు. ఈయన పాండురంగని సేవలో సశరీరంగా వైకుంఠ ప్రాప్తిని పొంది సంతులందరికి ఆరాధ్య దైవమయ్యారు.
సంత్ జ్ఞానేశ్వర్ కూడా పవిత్రమైన భగవత్గితని అందరికి అర్థమయ్యేలా మరాఠీలో రచించి ఆరధ్యమయ్యారు. ఈయన జన్మించిన ఆళంది నేటికి ఎంతో మంది విద్యార్థులకు వివిద సాంస్కృతిక రంగాలలో ప్రావిణ్యం కలిగిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తూ వున్నది.
ఈ విధంగా భగవత్ నామ స్మరణ, కీర్తనలు మరియు రచనలు భగవంతున్ని చేరడంలో తోడ్పడతాయి. వీరు ఉన్న సమాజం కూడా ఉన్నతి వైపు పరుగులు తీస్తుంది.