Thursday, 20 March 2014

మానవ జీవితం

జీవ జాతులలో ప్రముఖమైన జీవి మనిషి. ఆలోచనలతో, యుక్తితో తన పనిని పూర్తిచేసుకొని నేడు అన్ని జీవరాశులను మించి ఉన్నత స్థానంలో నిలుచున్నాడు. నేడు మనిషి మాత్రమే విచక్షణ కలిగిన జీవిగా పరిగణింపబడుతున్నాడు. మానవుడు తన అమోఘమైన శక్తి, యుక్తులతో సాధించలేనిదంటూ ఏది లేదు. కానీ దురదృష్టవశాత్తు తానేంతటి ఘనుదో మరిచిపోయి తాను నిర్మించుకున్న సమాజంలో సామాన్యుడి వలే జీవితం సాగిస్తున్నాడు.

సమాజం, బంధాలు, మిత్రులు, శత్రువులు ఇంకా అర్థం కాని అలవాట్లతో బందీ అయిపోయాడు. తన కనీస కర్తవ్యాలని సహితం విడనాడి విచ్చలవిడిగా తిరగనారంభించాడు. గుంపులో గోవిందంలా బ్రతకాలని అనుకుంటున్నాడు.
భారత దేశ పూర్వికులు ఆనాడే గుర్తించి మనవ జీవిత పరమార్థాన్ని గురించి ఎన్నో దిశానిర్దేశాలు చేశారు. సమసమాజం, దేశరక్షణ, ప్రజారంజక పరిపాలన ఇలా వివిధ రంగాలను దృష్టిలో వుంచుకొని రాసిన చాల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. మన పెద్దలు కూడా చెప్పే విషయాలు ఇందుకు దోహదం చేస్తాయి. అందులో ఒకటి "కృష్ణుడు చెప్పినట్లు చేయాలనీ రాముడు నడిచిన విధంగా నడవాలని" అంటారు.
ఇది రామాయణ, మహాభారత, భాగవత పురాణాలని అవగతం చేసుకున్న పెద్దలు చెప్పే మాట. శ్రీ కృష్ణుడు చెప్పే ఒక్కో మాట వేద ప్రమానమై భాసించడమే ఇందుకు కారణం. అలాగే రాముడి నడవడి ధర్మ మార్గాన్ని సూచిస్తుంది కాబట్టే ఇలా చెప్పడానికి కారణం. పురానంతర్గతమైన విషయాలు నేటికి ఆచరనీయాలే. వీటిని ఆచరించి మానవులు తమ జీవితాల్ని ఆనందమయం చేసుకోవాలని పడ్డ తపన మన పురాణాలు తేటతెల్లం చేస్తున్నాయి. 

No comments:

Post a Comment