శ్రీ రామ అంటేనే మనలో తెలియని ఆనందానుభూతి కలుగుతుంది. అసలు రామాయణం గురించి తెలిసిన వారు రామున్ని తమ ఇష్ట దైవంగా తప్పకుండ కొలుస్తారు, లేదా తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి సన్నివేశాన్ని శ్రీ రామునితో పోల్చి చూసుకుంటారు. ఏది ఏమైనా శ్రీ రాముడు తన అవతార కాలమందు చేసిన, నడచిన ధర్మ మార్గమే ఆయనకు అంత కీర్తిని సమకుర్చిందని చెప్పవచ్చు. శ్రీ రాముడే ధర్మానికి ప్రతిరూపమని అందరికి తెలిసిన విషయమే.
పూర్వం మహారాజులు అనేక మంది భార్యలను కలిగి ఉండేవారు, కానీ రాజైన శ్రీ రాముడు ఒకే భార్యను కలిగివుండి చిన్న కుటుంబమే చింత లేని కుటుంబమని చెప్పకనే చెప్పాడు. తన తండ్రి మాట జవదాటకుండా అడవులకు సహితం ప్రయాణమయ్యాడు. నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి రాజ్యంలో ఉన్నా అడవుల్లో ఉన్నా తన కార్యాన్ని ఎంత చాకచక్యంగా చేసుకుపోగాలడొ రామున్ని చూస్తే తెలుస్తుంది. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక యువకుడిగా, రాజుగా నాయకుడిగా ఎలా ఉండాలో శ్రీ రామున్ని గురించి తెలిస్తే అర్థమవుతుంది. శ్రీ కృష్ణుడు చెప్పినట్టు, శ్రీ రాముడు నడచినట్లు ఉండాలని పెద్దలు చెప్తారు.
నేటి సమాజంలో ఉన్న అనేక సమస్యలకు రామాయణం ఒక సమాదానంగా కనిపిస్తుంది. ప్రతి ఇంటా రామాయణ ప్రవచనాలు జరిగితే అసలు లోకంలో జరుగుతున్న ఎన్నో రకాలైన అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు. రామాయణాన్ని ఒక పాఠ్యాంషంగా విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి. అప్పుడే భవిష్యత్ సమాజం శ్రీ రామ రాజ్యంలా భాసిస్తుంది.

No comments:
Post a Comment