Monday, 3 June 2013

పురాణాలలో ఖగోళ విశేషాలు

మన భారతీయ పూర్వికులు ఖగోళ విశేషాలను గూర్చి ఎంతో విశ్లేషణ చేసి అనేకానేక ఆసక్తి దాయక విషయాలు మన ముందు పురాణ రూపకంగా ఆవిష్కరించారు. సౌర కుటుంబంలో సూర్యుడు ప్రధానుడని, ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని తెలియచెప్పారు. యమధర్మరాజు, యమున, శనీశ్వరుడు, తపతి మరియు అశ్వని దేవతలు వీరంతా సూర్యభగవానుని సంతానం. ఇక చంద్రుడు బహు భార్యలను కలిగి, తన కాంతులతో లోకాలన్నీ పావనం చేస్తుంటాడు.

చంద్రుని భార్యలు ఇరవై ఏడుగురు వీరంతా దక్షప్రజాపతి కుమార్తెలైన నక్షత్రాలు. చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రం లో ఉంటూ తన భార్యలను ఆనందపరుస్తూ ఉంటాడు. అలాగే నరులకు పితృదేవతలకు మధ్య సంధాన కర్తగా చంద్రుడు కనిపిస్తాడు. పురాతన కాలం నుండి నేటి విజ్ఞాన యుగం వరకు సూర్యచంద్రులను ఆధారం చేసుకొనే కాలగణన జరుగుతూ వస్తుంది. వీరే కాకుండా బుధుడు, శుక్రుడు, గురుడు, రాహు కేతు, కుజ/అరుణ మరియు శని గ్రహాల గూర్చి పురాణ గాథలు నేటికి అందుబాటులో ఉన్నాయంటే మన పూర్వికుల దూరదృష్టి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. 

భూలోకమే కాకుండా ఇంకా పదమూడు లోకాలు ఉన్నాయి. ఈ లోకాలలో దేవతలు, రాక్షసులు, యక్షలు ఇంకా ఎందరెందరో నివాసం ఉంటారు. లోకాలు రెండుగా విభజించబడ్డాయి అవి ఉర్త్వలోకాలు ఏడు , అధోలోకాలు ఏడు మొత్తం పదునాలుగు లోకాలు. ఉర్త్వలోకాలు వరుసగా భూలోకం, భువోలోకం, సువర్లోకం, మహోలోకం, జనోలోకం, , తపోలోకం మరియు సత్యలోకం. ఇక అధోలోకాలు వరుసగా అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల మరియు పాతాళలోకాలు ఉంటాయి.

సూర్యచంద్రులను రాహుకేతులు కబలించడమే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించడానికి గల కారణం. దీని వెనక అమృతమధనం నాటి కథ కనిపిస్తుంది. సుర్యచంద్రగ్రహణాలు సంవత్సరంలో కొన్నిమార్లే సంభవిస్తుంటాయి. ఇలా పురాణాలలో ఖగోళ విషయాలు చాల నిక్షిప్తపరిచారు మన పూర్వికులు.

No comments:

Post a Comment