Saturday, 8 June 2013

పెద్దలను గౌరవించకుంటే ఎదుర్కొవల్సివస్తుంది ఘోరవిపత్తు

పూర్వం దేవదానవయుద్ధం జరుగుతూవుండేది. ఒకనాడు ఇంద్రుడు యుద్ధరంగంలొ విజయం సాధించి పెద్దవూరేగింపుగా తన ఐరావతంపై రాసాగాడు. దేవతలంతా జయజయ ధ్వనాలు చేస్తూ ఇంద్రున్ని అనుసరించసాగారు. ఋషులు, మునులు, సిధ్ధులు మార్గమధ్యలొ ఇంద్రునికి పూమాలలు వేస్తూ అభినందించసాగారు. ఇదంతా గమనిస్తున్న నారదుడు తన సమీపంలొ వున్న దుర్వసమహాముని చెంతకు వచ్చి ఒక పుష్పాన్ని ఇచ్చి, ఆ పుష్పం సాక్షాత్తూ శ్రీమహావిష్నువు తనకు ఇచ్చాడని ఇప్పుడు అదే పుష్పాన్ని దుర్వాసునికి ప్రీతీతొ అందజేస్తున్నానని చెప్పి ఇస్తాడు.


ఇంతలో ఐరావతంపై ఇంద్రుడు దుర్వాసముని సమీపంగా వెళ్ళసాగాడు. దగ్గరలొ వున్న దుర్వాసుడు వెళ్ళి ఐరావతంపైనున్న ఇంద్రున్ని అభినందించి, నారదుడిచ్చిన పుష్పాన్ని ఇంద్రుడికి బహూకరిస్తాడు. కేవల పుష్పాన్ని ఇంద్రుడు అంతగా పట్టించుకోకుండా ఆ పుష్పాన్ని జారవిడుస్తాడు. ఆ పుష్పం ఐరావతంపై పడుతుంది, ఐరావతం తన తొండంతో పుష్పాన్ని కింద పడవేసి కాలితో తొక్కివేసి వెళుతుంది. ఇంద్రుడు ఇదంతా గమనించకుండానే వెళుతుంటాడు. 

ఇంద్రుడి ఈ విపరీత ధోరణి దుర్వసమహాముని మనస్సుని కలిచివేస్తుంది. ఋషులందరిలొ అతికోపిష్టిగా పిలువబడే దుర్వాసుడు తనకు జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. వెంటనే ఆయన ఇంద్రున్ని చేరి దేవతలంతా తమ సమస్త సంపదలు, శక్తులు కోల్పోతారని, ఇవన్నీ సముద్రంపాలు అవుతాయని శపిస్తాడు.

పెద్దలను గౌరవించకపోవడం వల్ల జరిగే విపత్తు ఈ కథ సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. 

No comments:

Post a Comment