దుర్వాసుని శాప ప్రభావం చేత దేవతలు తమ సమస్తమంతా సముద్రంలో కోల్పోయారు. ఇక దీనికి పరిష్కారం సముద్రమథనమేనని శ్రీమహావిష్ణువు ద్వారా తెలుసుకున్న దేవతలు, మథనానికి సన్నాహాలు చేయసాగారు. శ్రీమహావిష్ణువే స్వయంగా కూర్మావతారం ధరించి మేరుపర్వతాన్ని కవ్వంగా తనె మోయడానికి ముందుకివచ్చాడు. ఆదిశేషుడు తాడుగా సముద్రమథనానికి తోడ్పడ్డాడు. బలవంతులైన రాక్షసుల సహాయం అవసరమని గ్రహించిన దేవతలు, రాక్షసులను సహాయం అర్థించారు. తమకు సముద్రమథనం ద్వారా వచ్చే అమృతంలో సగభాగం ఇస్తేనే సహాయం చేస్తామని షరతు పెట్టారు. ఈ షరతుకు అంగీకరించిన దేవతలు రాక్షసులతో కలిసి సముద్రమథనం చేయసాగారు.
అనేకానేక సంపదలు సముద్రంనుండి బయల్పడసాగాయి. దేవతలు వీటిని పంచుకున్నారు. అమృతాన్ని ధన్వంతరి నారదునికి ఇస్తాడు. నారదుడు వెళ్లి శ్రీహరికి ఇచ్చి ఎలాగైనా అమృతాన్ని రాక్షసుల బారినుండి కాపాడమంటాడు. శ్రీహరి మోహినీ అవతారాన్ని దాల్చి రాక్షసులను మొహపరవశులను చేసి అమృతాన్ని దేవతలకు రాక్షసులకు సరి-సమానంగా పంచుతానని చెప్పి తన మోహన రూపంతో ఒప్పిస్తాడు. కాని రాక్షసులకు మధువును పంచుతూ దేవతలకు అమృతాన్ని పంచుతూ ఉంటాడు. ఇది గమనించిన రాహువు అనే రాక్షసుడు దేవతల వరుసలోకి వచ్చి కూర్చుంటాడు. అమృతం కుడా తాగడం ప్రారంభిస్తాడు. ఇంతలో సూర్య-చంద్రులు ఇది చూసి మోహినికి సైగ చేసి చెప్తారు. వెంటనే మోహిని శ్రీహరిగా మారి తన సుదర్శన చక్రంతో రాహువుని తల వేరుచేస్తాడు. అప్పుడు తల కేతువుగా కాయము రహువుగా ఏర్పడతాయి. రాహు-కేతువులు అమృతాన్ని తాగి అమరులవుతారు, కానీ తమ అమృత దాహాన్ని పూర్తి కానివ్వకుండా చేసిన సూర్య- చంద్రులను పగతో చేసే దాడి సమయాన్ని సూర్య-చంద్ర గ్రహణాలుగా భావిస్తారు. ఈ కాలమందు ఎలాంటి శుభకార్యాలు చేయరు.

No comments:
Post a Comment