వాయుపుత్రుడైన హనుమంతుడు
కేవలం శారీరక బలంలోనే కాకుండా బుధ్ధిబలంలో కూడా ఎంతొ పరిణతి కలిగివుండేవాడు. తన శక్తిసామర్త్యాలతొ చిన్నతనంలోనే సూర్యభగవానున్ని,
ఇంద్రున్ని మెప్పించాడు, వారి
ఆశీర్వాదంతో మరెంతో శక్తిమంతుడయ్యాడు. నమ్మిన బంటుగా ఉండే హనుమంతుడు వివిధ
శాస్త్రాలలో, వేదాలలో
ఇంకా వ్యాకరణంలో ఎంతో నిష్టతుడిగా పేరుగడించాడు. వ్యాకరణ శాస్త్రంలో
పటుత్వం పొందాలంటే హనుమంతున్ని పూజించాలని
పెద్దలు చెబుతారు. కేసరి, అంజన
సుతుడైన హనుమంతుడు పరమశివుని అంశగా పురాణాలలో కనిపిస్తాడు.
శ్రీ రాముడు సీత వియోగంతో వున్నసమయంలొ, శ్రీ రామునికి అన్ని విధాలా సహాయం చేస్తూ సీతాన్వేషణ సఫలీకృతం కావడానికి గల ముఖ్యకారణం ఆంజనేయుడె. అతి బలవంతుడై సముద్రాన్ని లంఘించి లంకలో దావానలాన్ని సృష్ఠించాడు. హనుమంతుడి మాటలు చిన్నవిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉంటాయని రామాయణం చెబుతోంది. చిరంజీవి అయిన హనుమంతుడు ఇప్పటికి గంధమాదన పర్వతంపై ఉన్నాడని అందరూ చెబుతారు.
వాలి, సుగ్రీవుల విషయంలో సత్యం ఎవరివైపు ఉందొ వారివైపే తన మద్దతు ఇచ్చి విజయాన్ని సాధించేలా చేసాడు. లక్ష్మణుని ప్రాణాలను కాపాడటానికి ఏకంగా సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు. శ్రీ రాముడి లాగె శరణన్న వారిని కాపాడే దైవం ఆంజనేయుడు.

No comments:
Post a Comment